[t4b-ticker]

కేసీఆర్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఉంటే ఆయనే లక్ష్యంగా దాడి జరిగేది

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ సెప్టెంబర్ 07: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని బీ ఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులకు నిరసనగా ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ మండల కేంద్రంలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.అసెంబ్లీ ఆవరణలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు ఎలాంటి కారణం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించిన దాడుల ఘటనలు పలు అనుమానాలురేకెత్తిస్తున్నాయన్నారు.ఈ ఆందోళన కార్య క్రమాలకు నేతృత్వం వహించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వమే నేరపూరిత రాజకీయాలకు కేంద్ర బిందువు కావడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఉంటే ఆయనే లక్ష్యంగా దాడి జరిగేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది అని, ఆయన క్రిమినల్ బుద్ధి తెలిసుకాబట్టే బీ ఆర్ఎస్ నేతలు అప్రమత్తంగా ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.కేటీఆర్, హరీష్ రావులు లక్ష్యంగా ప్రభుత్వం జరిపించిన దాడులు దీనికి సంకేతమని ఆయన నిలదీశారు.సభలో ప్రశ్నించకుండా బీఆర్ఎస్ ను రేవంత్ సర్కార్ బెదిరిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.ఉద్యమ సమయంలో ఇలాంటి ఘటనలను తిప్పికొట్టిన చరిత్ర బీ ఆర్ఎస్ దని ఆయన గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ కామెడీ చర్యలను ఎదుర్కోవడం గులాబీ సైన్యానికి ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి పరాభవిస్తారా? అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.ఇది గౌరవసభ కాదు కౌరవసభ, ఈ రోజు బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు,సీనియర్ నాయకులు రాజారాం యాదవ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News