ఆర్డీవోకు వినతిపత్రం అందజేత.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుపై నిరసన.
హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ రాస్తారోకో.
ప్రతిపక్షం.హుస్నాబాద్ సెప్టెంబర్ 7 : పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్న జీవో 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి ఆర్డీవో రామ్మూర్తికి వినతిపత్రం సమర్పించారు. శక్తి స్కీమ్ ద్వారా పాలిటెక్నిక్‌లను విలీనం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, గడిపే సతీష్ తో పాటు ఎంఏ. అన్వర్, సుద్దాల చంద్రయ్య, ఐలేని మల్లికార్జున్‌రెడ్డి, సూరంపల్లి పర్శరాం, కన్నోజు రామకృష్ణ, కందుకూరి సతీష్, గడ్డం సదానందం, గుగులోతు తిరుపతి, ప్రభాకర్‌రెడ్డి, బొజ్జ హరీశ్, లక్ష్మణ్ నాయక్, చిత్తారి శ్రీనివాస్, కూతాటి విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






























