[t4b-ticker]

ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ 100 అడుగుల విగ్రహం పెట్టాలి – ప్రభుత్వానికి డిమాండ్

చండూరు లో వీరనారి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో 50 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలి: ఐదారి శంకర్

ప్రతిపక్షం చండూరు, సెప్టెంబర్ 11: విప్లవ మూర్తి చాకలి ఐలమ్మ వంద అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో 50 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ ఐదారి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల మేల్కొల్పు గాత్రం చాకలి ఐలమ్మ గారి 41వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదారి నాగిళ్ల శంకర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలకు నిరంతర స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ, ఈ దేశ భవిష్యత్తును, పేదరికాన్ని, బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని భూమి కావాలని, నిరుపేద కుటుంబాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో నిరంతరం పోరాటం చేశారని అన్నారు. బానిసలుగా ఉన్న వారి సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఉద్యమాలు చేసి వెనుకబడిన వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా చెప్పుకోవడం వరకే మిగిలిందని, పూర్తి స్థాయిలో అధికారులు, ప్రభుత్వం నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.త్వరలోనే చాకలి ఐలమ్మ సంఘం ఐదారి కలం రాసిన ‘ఒడిసెల రాళ్లు’ పాట రాబోతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భూతరాజు సూర్యం, నాగిళ్ల భిక్షం, భూతరాజు వెంకన్న, భీమనపల్లి ముత్యం, భూతరాజు నరేష్, భూతరాజు యాదగిరి, భూతరాజు ఉదయ్ కుమార్, సంగేపు కోటి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News