ప్రతిపక్షం, వెబ్ డెస్క్: వైసీపీ అధిష్ఠానం తనకు అమలాపురం ఎంపీ టిక్కెట్టు ఇవ్వడంపై కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని పార్టీ నేత రాపాక వరప్రసాద్ తెలిపారు. తాను రాజోలులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజోలు టిక్కెట్టు దక్కించుకున్న గొల్లపల్లి సూర్యారావుకు గెలుపు అంత సులభం కాదని కూడా అభిప్రాయపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే అని అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చన్న ఉద్దేశంతోనే గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టు చెప్పారు. అధిష్ఠానం నిర్ణయం తరువాత ఇక చేసేదేం లేదని, తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజోలులో గెలుపునకు కచ్చితంగా తామంతా కృషి చేస్తామన్నారు.