[t4b-ticker]

వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ నాయకుడు భూపతిరాజ్ పర్యటన

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, సెప్టెంబర్ 18: మెదక్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ నాయకుడు భూపతిరాజ్ పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.మురుగు కాలువలు, పాత టైర్లు తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ప్రజలు సహకరించాలని కోరారు.రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భూపతిరాజ్ కోరారు.ఈ పర్యటనలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు

Spread the love

Related News

Latest News