ప్రతిపక్షం, అమరావతి: వచ్చేశాసనసభ ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. కాకినాడ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. తనకు శాసనభకు వెళ్లాలని ఉందని, లోక్ సభ కు పోటీ ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న ఆయన మూడు పార్టీల కూటమిలో తక్కువ సీట్లలో పోటీకి సరిపెట్టుకున్నారు. ఆచన పార్టీ 21 అసెంబ్లీ స్థానలకు, రెండు లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోంది.

 
								 
								 
															




























 
															