హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిలో ఇద్దరు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు రాగా.. ఒకరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రెటరీగా శివలింగయ్య ఐఏఎస్ నియమితులయ్యారు. అలాగే వరంగల్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ ఐఏఎస్‌ను వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు. వీరితో పాటు బీసీవెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న మల్లయ్య బట్టు.. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) ఎండీగా నియమితులయ్యారు.