ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ముహుర్తం ఫిక్స్ అయింది. మొదట తిరుపతిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుందని ప్రచారం చేయగా.. ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటుందని ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 16వ తేదీన స్టీల్ ప్లాంట్‌లో బహిరంగ సభ జరుగనుందని ఏపీ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ప్రకటించారు. ఈ కాంగ్రెస్ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, జాతీయ నేతలు కూడా హాజరు అవుతారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.