ప్రతిపక్షం, వెబ్ డెస్క్: శ్రీలంక క్రికెట్ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గురువారం కుటుంబ సభ్యలతో కలిసి ఆలయానికి వెళ్తుండగా అనురాధపుర సమీపంలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో తిరిమన్నెతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా గాయలయ్యాయి. గమనించి స్థానికులు వారందిరిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యంగా నిలకడగా ఉంది.