ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు. ముద్రగడ పద్మనాభంతోపాటు మరికొందరు కాపు నేతలు, అనుచరులు సైతం వైసీపీలో చేరారు.