Trending Now

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్‌.. స్టార్‌ ప్లేయర్ ఔట్!

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐపీఎల్‌ 2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ ఇప్పటికే ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోగా.. తాజాగా దక్షిణాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి కూడా తప్పుకొన్నాడు. గాయం కారణంగా ఈ ఎడిషన్‌ మొత్తానికి ఎంగిడి దూరం అయ్యాడు. ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ను ఢిల్లీ తీసుకుంది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ను రూ. 50 లక్షల ధర (రిజర్వ్‌ ప్రైస్‌)కు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోకి తీసుకుంది.

Spread the love

Related News

Latest News