ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని వార్త బయటకు రాగానే వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ తాను ఇదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు నిన్న ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సడెన్ డెసిషన్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఐయామ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే పవన్ కల్యాణ్‌పై పోటీ అంశంపై తాజాగా మరో సారి ట్విట్టర్ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేయడం లేదన్నారు. తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. తాను ట్వీట్‌లో ఎక్కడా ఎలక్షన్ అనే పదాన్ని వాడలేదని తెలిపారు. పిఠాపురంలో తీసిన షార్ట్ పిల్మ్‌తో ఓ కాంటెస్ట్‌లో తాను పాల్గొంటున్నానన్నారు.