ప్రతిపక్షం, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీకి ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ ఎడిషన్ చివరిదని, చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ధోనీ కచ్చితంగా ఆడగలడని, ఐపీఎల్ 2025లో కూడా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కుంబ్లే వ్యాఖ్యానించాడు. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ అందుకు అతడు సిద్ధంగా లేడని తాను భావిస్తున్నట్టు మాజీ లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. ఎంఎస్ ధోనీ అందరితో కలిసిపోవాలని కోరుకునే ఆటగాడని, ఈ విషయంలో ధోనీ, సచిన్ టెండూల్కర్ ఒకటేనని కుంబ్లే పోల్చాడు.