ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కావలి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏ పార్టీలో చేరేది కొన్ని రోజుల్లోనే ప్రకటిస్తానని తెలిపారు. కాగా, వేణుగోపాల్ రెడ్డి త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.