Trending Now

పార్లమెంట్ ఎన్నికల్లో వంశీచంద్ రెడ్డిదే గెలుపు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాబోయే భవిష్యత్తు మొత్తం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశి చింత రెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్యే శంకర్ సమీకరణను చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలో ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన 53 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అందరికీ ఎమ్మెల్యే శంకర్ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు.

దేవునిపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు వీరే..

దేవునిపల్లి గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి చేరిన వారిలో గ్రామానికి చెందిన కురువ మల్లేష్, నర్సింలు, శ్రీనివాస్, రవి యాదవ్, అంజయ్య జంగయ్య, బేరి శ్రీనివాసులు, యాదయ్య, కోతి శ్రీనివాస్, ఎదిరే వేణు గౌడ్, కృష్ణయ్య, దశగిరి కుమార్, రాజ్ కుమార్, శీను, మణికొండ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News