ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: యూపీ, బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రాల విస్తీర్ణం, హింసాత్మక, మావో ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో 5 విడతలు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో నాలుగు విడతలు, ఛత్తీస్‌గఢ్, అస్సాంలో 3 విడతలు, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లో రెండు విడతలు, మిగతా 22 రాష్ట్రాలు/UTల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.