ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పార్లమెంట్ అభ్యర్థులు రూ.90 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చని తెలిపింది. అసెంబ్లీకి పోటీ చేసే వారు రూ.38 లక్షల వరకు ఖర్చు చేయొచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఖర్చుల వివరాలు ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.