ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మే 13న ఎన్నికల జరగనుండటంపై TDP చీఫ్ చంద్రబాబు స్పందించారు. ‘ఐదేళ్లుగా 5 కోట్ల మంది ఈ రోజు కోసమే ఎదురుచూశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక పోలింగే మిగిలింది. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక ‘నో’ ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా గళం వినిపించే రోజు వచ్చింది. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే’ అని ట్వీట్ చేశారు.