ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఓ దశలో క్రికెట్‌ను వదిలేద్దామని అనుకున్నానని టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ వెల్లడించారు. “గతంలో సరైన అవకాశాలు లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఓసారి ఇంట్లో నాన్నతో ఏదో గొడవైనప్పుడు ఆయన ‘నీకు నిజాయతీ ఎక్కువ అందుకే నష్టపోతున్నావ్’ అని అనేశారు. సాధారణంగా ఎప్పుడూ అంత బాధపడను. కానీ అప్పుడు గదిలోకి వెళ్లి గంటల తరబడి ఏడ్చాను. కొంతకాలం అలా చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడ్డాను” అని తెలిపారు.