ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం హైదరాబాద్ హైదర్‌గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ను స్పీకర్‌కు అందజేశారు. కాగా ఆదివారం దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.