ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ప్రచార కార్యాచరణపై చర్చించారు. ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఆదివారం బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభ జరిగిన తీరుపై సమీక్ష జరిపారు. ఈ సభను విఫలం చేసేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని నేతలు చంద్రబాబుకి తెలిపారు.