ప్రతిపక్షం, హైదరాబాద్: ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడి పోలేదోయ్..’ అనే గీతాన్ని గుర్తుకు తెస్తున్నాయంటున్నారు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు మాటలు. బీఎస్పీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కు పార్టీ కండువా కప్పుతూ ‘ఒకసారి ఓడితే నష్టమేమి లేదు. గాడిద వెంట పోతేనా కదా.. గుర్రాల విలువ తెలుస్తుంది’ అన్న ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘ఒకసారి ఓడితే నష్టంలేదు’ అన్న సమర్థింపు ఇతర పార్టీలకు వర్తించదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓటమిని ఎగతాళి చేసి ‘రిటర్న్ గిఫ్ట్ ’గా వ్యాఖ్యానించిన తీరును గుర్తు చేస్తున్నారు.