ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. పులివెందుల, కమలాపురం మీదుగా సీఎం ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడే తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురం ప్రాంతాల్లో ప్రయాణిస్తారు. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు యాత్రపై పూర్తి వివరాలను వైసీపీ నేతలు ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.