Trending Now

పీచే మూడ్​..! రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ నుంచి ప్రతిపక్షం ప్రతినిధి: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. ఇదే కేసులో ఈడీ ఇప్పటికే అరెస్టు చేయడంతో.. పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి తెలిపారు. పిటిషన్‌ ఉపసంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం అనుమతించింది. చట్టప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలతకు వెళ్తామని చౌదరి తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను జారీ చేస్తూ గతేడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిన్‌ దాఖలు చేశారు. కాగా, కవిత అరెస్టు అక్రమం అంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.

Spread the love

Related News

Latest News