ప్రతిపక్షం, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్‌లో వరుణ్ చేస్తున్న తాజా సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇందులో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ సినిమా మార్చి 1న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 20న మంగళవారం ఉదయం 11.5 నిమిషాలకు ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. హీందీ ట్రైలర్‌ను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగులో దానిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేయనున్నారు. కాగా ఇందులో ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా వరుణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది.