ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మోడీ ప్రచారంలో విద్యార్థులను వీధుల్లోకి దింపడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఎన్నికల ప్రచారానికి పిల్లలను తీసుకురావడం చట్టరీత్యా నేరమని ఈసీ పేర్కొంది. హెడ్ మాస్టర్‌తో పాటు ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖాధికారి వివరణ ఇవ్వాలన్నారు.