ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బెంగళూరు ప్రజలు నీటి కటకటతో అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ‘నీటి కుంటలు కనుమరుగవడం లేదా ఆక్రమణకు గురయ్యాయి. 6,900 బోర్లు ఎండిపోయాయి. నగరానికి రోజుకు 260 కోట్ల లీటర్ల నీరు అవసరం. ప్రస్తుతం కావేరీ నది నుంచి 147 కోట్ల లీటర్లు, బోర్ల నుంచి 65 కోట్ల లీటర్లు వస్తోంది’ అని తెలిపారు.