ప్రతిపక్షం, వెబ్ డెస్క్: IPL-2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను తీసుకొస్తున్నారు. దీనివల్ల థర్డ్ అంపైర్‌కు నిర్ణయాలు తీసుకోవడం ఈజీ కానుంది. 8 హైస్పీడ్ కెమెరాలు తీసే వీడియోలను హాక్ ఐ ఆపరేటర్ల ద్వారా థర్డ్ అంపైర్ చూస్తారు. గతంలో కంటే ఎక్కువ దృశ్యాలను వివిధ కోణాల్లో చూసే అవకాశం ఉంటుంది. కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సాయపడనుంది. అంపైర్లకు ఇటీవలే దీనిపై శిక్షణనిచ్చారు. ఈ విధానాన్ని ఇప్పటికే ‘ద హండ్రెడ్’ టోర్నీలో వాడారు.