ప్రతిపక్షం, వెబ్ డెస్క్: శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో రద్దీ తగ్గింది. పరీక్షల సమయం కావడంతో భక్తజనం పెద్దగా కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉన్నాయి. దర్శనం సులువుగానే అవుతోంది. రూ.300 టికెట్ కొన్నవారికి గంటలోనే దర్శనం పూర్తవుతోందని అధికారులు తెలిపారు. ఇక నిన్న స్వామివారిని 63,251మంది దర్శించుకోగా.. వారిలో 20,989మంది తలనీలాలు ఇచ్చారన్నారు. రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు.