ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రస్తుతం గ్యారంటీల గారడీ మాత్రమే నడుస్తున్నదని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని తెలిపారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ చేసిన అప్పుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.