ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 11 MLA, 13 MP స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ లిస్ట్ లో టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొందరికి దాదాపుగా సీట్లు లేనట్లే కనిపిస్తోంది. కళా వెంకట్రావు, దేవినేని ఉమ, సత్యనారాయణ, జవహర్‌కు మూడో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఇటు చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీపై సందిగ్ధం నెలకొంది. దీంతో అక్కడి సీనియర్ నాయకురాలు కిమిడి మృణాళిని సీటు పైనా క్లారిటీ రాలేదు. మరోవైపు సీనియర్లు సోమిరెడ్డి, కోళ్ల లలిత, వనమాడి వెంకటేశ్వర్లు టికెట్లు కన్ఫార్మ్ చేసుకున్నారు.