ఆర్డీవోకు వినతిపత్రం అందజేత..
ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: ఆదాయపన్ను శాఖ పేరుతో కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడానికి నిరసిస్తూ.. ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శిందే ఆనందరావు పటేల్ నాయకత్వంలో బైంసా పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ని సీజ్ చేయడం అంటే ప్రజాస్వామ్య విలువలను ప్రభావితం చేయడమేనని, ఎన్నికల సమయంలో ఎలాంటి రూపాయి ఖర్చు చేయకుండా, అకౌంట్ లో సీజ్ చేయడం.. అప్రాజస్వామికమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలకు విరాళాల పేరుతో వచ్చే నిధులకు ఎలాంటి ఆదాయ పనులు వర్తించదని ఆయన గుర్తు చేస్తూ, గత రెండు ఎన్నికలల్లో బీజేపీ పార్టీకి వచ్చినటువంటి నిధులకు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించడం లేదని, బీజేపీ పార్టీ అకౌంట్లను కూడా సీజ్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ అధ్యక్షులు నడిమిశెట్టి భూమన్న, ఉపాధ్యక్షులు అహ్మద్ ఖాన్, కుబీర్ మండల పార్టీ అధ్యక్షులు రాథోడ్ జయరాం నాయక్, భైంసా రూరల్ అధ్యక్షులు దొడ్డికింది రామేశ్వర్, ఎన్ ఎస్ యు ఐ నిర్మల్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అంజద్ షేక్, మైనార్టీ నియోజవర్గ నాయకులు జావిద్ ఖాన్, చౌహన్ రోహిదాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.