ప్రతిపక్షం, వెబ్ డెస్క్: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొంది. 23న హైదరాబాద్-ధనపూర్, 25న సంత్రాగచి-సికింద్రాబాద్, 26న ధనపూర్-హైదరాబాద్, 24న సంత్రాగచి-చెన్నై సెంట్రల్, 27న పట్నా-కోయంబత్తూర్ మధ్య రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.