ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. ఇవాళ ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇవాళ ఇదే కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈడీ కస్టడీ పొడిగింపు కోరే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకుంటే ఆమెను జైలుకు తరలించే అవకాశాలున్నాయి. దీంతో కవితకు జైలా? బెయిలా? అన్నది ఆసక్తికరంగా మారింది.