ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ED కస్టడీ నుంచి పాలన సాగిస్తున్నారు. తాజాగా అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. మొహల్లా క్లినిక్‌లలో టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించినట్లు చెప్పాయి. అంతకుముందు నీటి సమస్య నివారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నీటి సమస్యపై ఆయన ఆదేశాలిచ్చారని ఢిల్లీ మంత్రి ఆతిశి చెప్పగా, దీనిపై ED విచారణ జరుపుతోంది. తాజాగా మంగళవారం రెండో సారి ఆదేశాలిచ్చారని AAP పేర్కొంది. ED కంప్యూటర్, కాగితం ఇవ్వకున్నా కేజ్రీవాల్ ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.