ప్రతిపక్షం, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి అప్ డేట్ వచ్చేసింది. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు మేకర్స్ మూవీ నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సాంగ్ విడుదలవుతుందని ప్రకటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.