ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇక నుంచి ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ మేరకు భారత్-, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ కోసం షెడ్యూల్ ఖరారైంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు సుమారు రెండు నెలలపాటు అక్కడే గడపనుంది. నవంబర్ 22వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత్, -ఆసీస్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుండటం 32 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.