ప్రతిపక్షం, సినిమా: వరుణ్ తేజ్ హీరోగా శక్తిప్రతాప్ సింగ్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషి చిల్లర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, రుహాని శర్మ కీలకమైన పాత్ర పోషించింది. ఈ సినిమా, మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ఈవెంటులో వరుణ్ తేజ్ మాట్లాడాడు.
“మీ అందరికీ ప్రధానమైన వినోద సాధనం సినిమా అనే సంగతి నాకు తెలుసు. నా కథలు కొత్తగా కనిపించడానికి నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. అలా నేను చేసిన సినిమానే ఇది. టికెట్ కోసం మీరు పెట్టిన డబ్బులకు న్యాయం చేసేదిగా ఈ సినిమా ఉంటుందని నేను బలంగా చెబుతున్నాను.. తెలుగులో మొదటిసారిగా వస్తున్న ఏరియల్ సినిమా ఇది. సరిహద్దుల్లో ఎలా ఉంటుంది..? జవాన్ల త్యాగాలు ఎలా ఉంటాయి..? అనేది ఈ సినిమా చెబుతుంది. మీ అందరిలో దేశభక్తి ఉంటుంది.. ఈ సినిమా చూసిన తరువాత మరింత పెరుగుతుంది” అని వరుణ్ తేజ్ చెప్పాడు.