ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఏపీని కాపాడాలన్న అజెండాతోనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో ఆయన సమావేశమయ్యారు. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించానని అన్నారు. వాలంటీర్లు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తామని చంద్రబాబు అన్నారు. స్కిల్ డెవల్ మెంట్ ద్వారా వాలంటీర్ల జీతాలు మారుస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.