ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: అదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ప్రకటన పట్ల కాంగ్రెస్ శ్రేణులలో హర్ష వ్యక్తం అవుతున్నాయి. గత కొంతకాలంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రకటన ఉత్కంఠభరితంగా మారింది. అయినాప్పటికీ ఆత్రం సుగుణ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను, గ్రామాలను తనదైన రీతిలో చుట్టుముడుతూ కాంగ్రెస్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు.
నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన పార్లమెంటరీ తరహా కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగాలతో ప్రజల మనసులను దోచుకున్న ఆత్రం సుగుణకు ఈ నియోజకవర్గాలలో ఏ ఏస్థాయి ఓట్ల శాతం దక్కుతుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సీతక్క కూడా మన ఆదిలాబాద్ కు కాబోయే కాంగ్రెస్ ఎంపీ ఆత్రం సుగుణ నేనని వారం రోజుల క్రితమే ఆయాసభలలో ప్రకటించడం జరిగింది. అయితే స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఆత్రం సుగుణకు అన్ని సామాజిక వర్గాల నుంచి సముచిత గౌరవ దక్కుతుందని ఆమె భారీ మెజార్టీతో గెలువబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.