ప్రతిపక్షం, వెబ్ డెస్క్: స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీలోని స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాం పక్కనే సిలిండర్ గోదాం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.