ప్రతిపక్షం, దుబ్బాక మార్చి 29: కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని శుక్రవారం వారి నివాసంలో మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ అభ్యర్థిగా తన ఎంపికలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు అందించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో మీ సలహాలు, సూచనలకు అనుగుణంగా ప్రచారంలో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలలో తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మెదక్ పార్లమెంటు లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు విజయం ఖాయం అన్నారు.