ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారు.. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు. వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందన్నారు. కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ.. కాంగ్రెస్ లోకి పోయిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదే మహేందర్రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారి కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయమని కేటీఆర్ సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి లీకు వీరుడుగా మారిండు.. ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలని.. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడని.. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ గారు అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బీఅర్ఎస్ అని.. 13 తేదిన జరిగే చెవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరు తరలిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గం లో గెలుస్తున్నామని.. రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలలో గెలిచే మొదటి స్థానం కచ్చితంగా చేవెళ్లదే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కాసానికి జ్ఞానేశ్వర్ విజ్ఞప్తి చేశారు.