ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL-2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ పలు రికార్డులు నెలకొల్పారు. IPLలో RCB తరఫున అత్యధిక సిక్సులు (241) బాదిన బ్యాటర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు గేల్(239) పేరిట ఉండేది. అలాగే టోర్నీ చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల లిస్టులో ధోనీని(239) అధిగమించి 4వ స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో గేల్(357), రోహిత్ (261), ABD(251) తొలి 3 స్థానాల్లో ఉన్నారు.