ప్రతిపక్షం, వెబ్డెస్క్: సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. బీ4 బోగీలోని బ్యాటరీలో క్యాప్ లీక్ కావడంతో పొగలు వస్తున్నట్లు రైలు సిబ్బంది గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన టెక్నికల్ సిబ్బంది, రైల్వే అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడే రైలును 2గంటలపాటు నిలిపివేశారు.