ప్రతిపక్షం, వెబ్డెస్క్: నాగోల్లో సుప్రజ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియాలజీ , అడ్వాన్స్డ్ సిటీ స్కాన్ విభాగాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా సుప్రజ హాస్పిటల్ వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం వైద్యానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని.. వైద్యం ప్రభుత్వ కార్యక్రమం అయిన.. పెరుగుతున్న అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రైవేట్ హాస్పిటల్లలో కూడా సేవలు అందించే కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.