ప్రతిపక్షం, వెబ్డెస్క్: టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు రెండు సెంట్లలో ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడున్న కాలనీలు ఏవీ రద్దు చేయబోమని, అక్కడే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. అలాగే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ ఈ రాష్ట్రానికి అప్పుల అప్పారావులా తయారయ్యారని విమర్శించారు. ఆయన చేసిన అప్పులన్నీ తీర్చాల్సింది ప్రజలేనని చెప్పారు.