భీమకాళీ ఆలయంలో కంగనా ప్రత్యేక పూజలు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చన చేయించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలను ఆమె స్వీకరించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు కంగనాకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె కమలం పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ ప్రతిభాసింగ్‌ను ఆమె ఎదుర్కొబోతున్నారు.

Spread the love

Related News