Trending Now

నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలి..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 1: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI)జిల్లా మహాసభ ప్రజాసంఘాల ఆఫీస్ లో ఎస్ఎఫ్ఐ 4 వ జిల్లా మహాసభలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర లా కన్వీనర్ రాచకొండ విఘ్నేష్, మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి బొమ్మెనసురేష్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ధ్వంసం చేస్తుందని అన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నిర్మల్ జిల్లా ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని వారు కోరారు. అదే విధంగా బాసర ఐఐఐటీ అధిక నిధుల తో బడ్జెట్ ని అందించలని అన్నారు. ఈ మహాసభ లో భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించామని భవిష్యత్తు లో ఉద్యమాలను నిర్వహిస్తామన్నారు. నూతన జిల్లా కమిటీ 11మంది తో ఎన్నిక కావడం జరిగింది. నూతన జిల్లా అధ్యక్షులు నవీన్, జిల్లా కార్యదర్శి దిగంబర్ జిల్లా ఉపాధ్యక్షులుగా పరమేష్, నితిన్, నీరజా, జిల్లా సహాయ కార్యదర్శి లు నితిన్,చంద్రకాంత్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News