ప్రతిపక్షం, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. హతమైన నక్సలైట్లతో పాటు, సంఘటనా స్థలం నుంచి INSAS LMG, AK47 వంటి ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు. మరోవైపు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.